ABOUT US
A FLOWER TO THE GOD
The history is never false. The wonderful incidents which were mentioned in the history are not imaginations. The almighty God will pass his blessings helps with great victories secretary to the people according to their activities and their mental attitudes. The history of the people may appear as false stories as it was happened long long ago. We should have the pure water pond of service in our hearts to digest the ancient incidents. Wonder! Many people cannot identify that, they are having the pure water pond of service in their hearts. This world is like a garden With Colorful flowers. But the said pond of service will gradually sink out as the people run after trying to grasp the fragrance of beautiful and Colorful flowers. A Persons cannot see the god until he is having pure pond of services un his hearts. His heart and life reaches the scared feet of god, like a flower
దేవునికొకపుష్పం!
చరిత్ర ఎప్పుడూ అసత్యం కాదు, చారిత్రక కథాంశాల్లో వున్న అద్భుత సంఘటనలు ఏవి కూడా అభూతకల్పనలు కావు ? ఆ కాలాల్లో …. ఆయా సమయాల్లో ….. స్వార్థ నిస్వార్థపు సమరాల్లో… వ్యక్తుల మానసిక స్థితులనుబట్టి…… భగవంతుని అజ్ఞాతపు సహాయాల వల్ల …. ఆతని అంతర్లీనపు ఆశీస్సుల వల్ల ఆయా వ్యక్తుల కి గొప్ప గొప్ప విజయాలు దక్కుతూ ఉంటాయి. అనంతమైన ఈ కాలగమనం లో…. ఆ వ్యక్తుల చరిత్రలు ఒక కల్పనిక కథలలాగ అనిపించవచ్చు. కానీ..? అలాంటి సత్యమైన సంఘటనలని హృదయాలు జీర్ణం చేసుకోవాలంటే…”సేవ” అనే మంచినీటి “సెలిమ” వొకటి ప్రతి హృదయం లో వుండాలి.చిత్రమేమంటే ..!ప్రతి మనిషి హృదయంలో “సేవ”అనే ఒక మంచి నీటి సరస్సే ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవడం!..?రంగు రంగుల పూదోట వంటి ఈ ..ప్రపంచం లో .ప్రతీ మనిషి..సుఖాల సువాసనల వైపుగా ..పరిగెడుతున్నంత కాలం..హృదయం లో ఉన్న “సేవ” అనే మంచి నీటి “సెలిమ”ఎండిపోతూనే ఉంటుంది. ”సేవ” అనే మంచినీటి “సెలిమ”మనిషిలో లేనప్పుడు…ఆ మనిషికి దైవదర్శనం…ఒక ఎండమావి మాత్రమే …?ఏ ..మనిషిలో అయితే …హృదయంలో “సేవ” అనే మంచినీటి “సెలిమ”నిండుకొని వుంటుందో ..ఆ..మనిషి హృదయం ..అతని జీవితం..దేవుని పాదాల ముందున్న పుష్పమే!!!
THE FAMILY OF THE GOD
The emperors, queen, princes, princeses, land lords and height rich persons who born with golden spoons in their mouths were disappeared in the history without their special identity. Their treasures did not help them to be special persons in the history. But we still remember some persons because of their service to the people and great personalities. Their life style will be fixed in the hearts of people and great personalities. Their life style will be fixed in the hearts of people and they are still prayed by the people because of their selfless services to the people so, the persons who will try to help the needy selflessly will become the family members of god you…too…
దేవుని కుటుంబం
కాలికి మట్టి అంటకుండా పెరిగిన గొప్ప గొప్ప శ్రీమంతులూ.. రాజులూ .. రాణులూ.. చక్రవర్తులూ… రాజకుమారులూ…. రాజకుమార్తెలూ…. వారి వారి ముఖాల ఆనవాలులు కూడా లేకుండా గతించిపోయారు. ఆనాటి వారి సంపదలన్నీ ఈనాడు కాల గర్భంలో కలిసిపోయాయి. కానీ…? కొద్ది మంది విశిష్ట వ్యక్తిత్వం వల్ల… ఆనాటి వ్యక్తుల “సేవ” కార్యాలు, ప్రజాహిత సంఘటనలు మాత్రం స్థిర స్థాయీగ చరిత్ర కెక్కివున్నాయి. ఆ వ్యక్తుల కీర్తి ప్రతిష్టలు… కాలానికి పోటిగా … నిత్యం పరిగెడుతూనే ఉంటాయి.. వ్యక్తులు ఎందరయి నా… పేర్లు ఎన్నైనా… ఆ …. వ్యక్తుల జీవితాలు నిత్య పారాయణ గ్రంథాలుగా వేలాది హృదయాల్లో ఆదర్శంగా వెలుగుతూనే వుంటాయి . ఆ వెలుగులకి నిత్య జీవమిచ్చేది నిస్వార్థమైన “సేవ” మాత్రమే ; మహాత్ముల జీవితాలకు వెలుగు … ఈ … సేవయే : నిస్వార్ధపు “సేవ ” పారాయణులందరూ…. దేవుని కుటుంబంలో బంధువులే !! ఆ బంధువులలో… మీరూ ఒకరు కావచ్చు ..!!
OUR SACRED COUNTRY, INDIA
Our country is sacred one in the world like a perfect woman, i.e. soubhagyawathi. Our country is being respected as mother in tradition and values and will be respected in future too. Our country is greatest one in the world in maintaining traditions, Customs and human values. But mother “Bharathi” is still weeping for loss of patriots in freedom fight. We should all serve for the poor by maintaining secularism. We should all serve for the poor by maintaining secularism. We can loudly say that, mother Bharathi, We are your real sons and daughters.
O, brothers and sisters, come forward to serve the country. Let us work hard for the country. Let us work hard for the country. Mother Bharathi will bless her people who serve the poor. If you do so, you will be the one of the rays of mother ‘bharathi’s smile
మన పుణ్య భారతి
ప్రపంచ దేశాల్లో కెల్లా… మన భారతదేశం ఒక నిండు ముత్తయిదువ… నుదుటి కుంకుమ బొట్టు పవిత్రతనీ… స్త్రీల.. సౌభాగ్యపు పుణ్యతనీ.. చాటుతూ.. ఈనాటికీ.. ఏనాటికీ.. యావద్దేశాలకి తల్లిగా.. గౌరవింప బడుతూవుంది. గౌరవించ బడుతూనే ఉంటుంది.. పవిత్రతలో.. ఆధ్యాత్మిక జీవనం.. లో సముచిత స్థానానికి ఆదర్శమైన మన తల్లి భారతి.. దేశ భక్తి గల తన ముద్దు బిడ్డలను స్వాతంత్ర్య పోరాటాల్లో పోగోట్టుకొని.. ఈనాడు దీనవతి యై దుఃఖిస్తున్నది: కులాలకు మతాలకు అతీతమైన మన జగదైక కుటుంబంలో పేదల “సేవ”కు అందరం నడుం బిగిద్దాo.! అమ్మా.. తల్లి భారతి మేము.. నీ.. నిజమైన బిడ్డలమని.. నినాదించుదాం..
అక్కల్లారా! చెల్లెల్లారా! అన్నల్లారా! తమ్ముల్లారా! దేశమాత సేవలోకి రండి! తల్లి భారతమాత దుఃఖాన్ని పోగొట్టి తల్లి ఋణం తీర్చుకోండి ఎవరైతే… దేశ పేదల కోసం శ్రమిస్తారో…. వారి కోసం దేశమాత చిరు నగవుల వెలుగులు…. నిత్యం ఎదురు చూస్తూ…. తల్లి భారతి చేతులు…. మన వైపు చాచే ఉంటాయి …
భారతమాత చిరు నగవుల వెలుగుల కిరణాల్లో… మీరూ… ఒక కిరణమవుతారు. కదూ!!
SERVICE TO THE NATION
This ASHRAM(Cirimallela Productions Pvt Ltd) is working for the service to the nation. There is a great poverty in the country. Meaningless traditions, bad habits are spoiling the lives of the people. This Ashram is my dream house which is built myself to work hard to see the India without huts. The establishment of cirimallela productions is formed from my tears by seeing my bharathmatha with dirty clothes i.e. poverty, even though the country is developing in many aspects. I cannot say how much change I can bring in the country, but I do not step back in my journey of services.
I take an oath before the feet of Bharathmatha that, I continue my journey with self less
Service to my nation.
I wish you also accompany with me ……..
దేశ “సేవ”లో
దేశ”సేవ”లో భాగమే… ఈ.. ఆశ్రమం( సిరిమల్లెల ప్రొడక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ ): అంతులేని అగాధంలా వున్న.. దేశ పేదరికాన్ని చూసి.. ఇంకా మాసిపోని మూఢాచారాలని చూసి… మానని చెడు అలవాట్లతో.. జీవితాలు కోల్పోయిన అభాగ్యులని చూసి… ఏనాటికైనా.. పూరిగుడిసెలులేని భారతదేశాన్ని చూస్తానన్న ఆశతో… నాకు నేనుగా… నిర్మించుకున్న కలల సౌధమే ఈ .. ఆశ్రమం !! ఎంత అభివృద్ధి చెందినా.. పేదరికంతో ఇంకా మాసిన బట్టలనే కడుతున్న తల్లి భారతమాతను చూసి.. వొలికిన.. నా.. కన్నీళ్లే.. ఈ..” సిరిమల్లెల ప్రొడక్షన్స్ “ ఈ దేశాన్ని ఏ.. మాత్రంమారుస్తానో… తెలియదు గానీ.. దేశ సేవలో.. నా ..ప్రయత్నాన్ని మాత్రం మానను. ఈ.. నా.. నడకలో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని అపనిందలు.. వచ్చినా.. నేను వెరవను. (భయపడను) వెనుదిరుగను; దేశమాత “సేవ”లో… నిస్వార్ధంగా ఇలాగే ముందుకు సాగి పోతానని.. భారతమాత పాదాల మీద ప్రయాణం చేస్తున్నాను.! మీరు కూడా నా వెంట వస్తారు కదూ!
చింత
ఎవరో వొకరు వచ్చి మిమ్మల్ని వోదార్చాలని.. ఎప్పుడూ అనుకోకండి ..! మీరే వొకర్ని వోదార్చే స్థితికి రండి!! ప్రతి వొక్కరిలో ఎంతో శక్తి.. దాగి వుంది ఆశక్తి.. దేవున్ని కూడా మీ.. దగ్గరికి రపించగలదు; దేవున్నే.. మీ.. దగ్గరికి రప్పించే శక్తి.. మీలో ఉన్నప్పుడు ఇంకొకరి వోదార్పు మీకు అవసరమా..? ఈ.. క్షణమే.. మీకు మీరు ధైర్యపర్చుకోండి, దేవుడు.. మీ.. హృదయం కంటే… మీకు… అత్యంత సమీపంగా వున్నాడు; మీకు మీరుగా మార్పు చెందినప్పుడు.. మీరు పిలవకనే.. ఆయనే.. మీ.. దగ్గరికి… వస్తాడు!! వస్తాడు!! వ.. స్తా.. డు..
Worry
Never think that somebody will comes to console you. You should develop yourself to console and help others.
Everybody has the divine power that can bring even the God to You.
When you are having the power that can bring the God closer to you, is there any necessity to pray for somebody’s condolence?
Motive yourself now itself, God is very closer than your hearts.
The God will himself come to you even you do not call him, when you change yourself in positive way.
Comes … Comes … Comes …!
Cirimallela.Venkateswarulu